క్రికెట్ లోకి కొత్త జట్టు... పేరు 'పాకియాతాన్'...

క్రికెట్ లోకి కొత్త జట్టు... పేరు 'పాకియాతాన్'...

ప్రపంచ క్రికెట్ లోకి కొత్త  జట్టు వచ్చింది. దాని పేరు ''పాకియాతాన్'' ఏంటి వింతగా  ఉంది కదా! కానీ ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్వయంగా ప్రకటించింది. అయితే ఆగస్టు లో ఆడాల్సిన మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ కోసం పాకిస్థాన్ జట్టు  ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళింది. ఆ సమయం లో పీసీబీ ఆటగాళ్ల ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అయితే ఆ ఫొటోకు క్యాప్షన్ గా  ''పాకియాతాన్ జట్టు ఇంగ్లాండ్ కు వెళ్ళుతుంది. ఆల్ ది బెస్ట్  బాయ్స్'' అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక తాము చేసిన తప్పును తెలుసుకొని సరిదిద్దుకునేలోపే అభిమానులు దానిని ట్రోల్ చేసేసారు. రకరకాల మీమ్స్ తో పీసీబీని క్రికెట్ ఆడేసుకున్నారు. ఇక అంతక ముందు పీసీబీ నిర్వహించిన కరోనా పరీక్షలో ఓసారి పాజిటివ్, మళ్ళీ నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్ ఇలా తప్పుడు ఫలితాలు రావడంతో పీసీబీ పై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు మళ్ళీ పీసీబీ ఈ తప్పు చేయడంతో దానిని వైరస్ కంటే వేగంగా వైరల్ చేసారు.