ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకు..

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత డీసీసీలకు..

గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సమావేశం ముగిసింది... రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్‌ కుంతియా, ఉత్తమ్, జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, కొండా విశ్వేశ్వరరెడ్డి.. తదితర నేతలు హాజరైన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగగా... ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను డీసీసీలకు అప్పగిస్తూ పీసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సాయంత్రం వరకు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఓ కొలిక్కిరానున్నాయి. కాగా, మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
- రంగారెడ్డి జిల్లా నుండి మల్‌రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా..
- వరంగల్ నుంచి కొండా మురళి పేరు పరిశీలిస్తున్నారు.
- నల్గొండ నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీ ని బరిలోకి దింపాలని రాజగోపాల్ పై క్యాడర్ ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.
- పటేల్ రమేష్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం.