హోదా రాకపోతే ఏపీలో అడుగుపెట్టను

హోదా రాకపోతే ఏపీలో అడుగుపెట్టను

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తాను రాష్ట్రంలో అడుగుపెట్టనని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలిపారు. ఈరోజు అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ఏపీకి ప్రత్యేక హోదా అమలుచేసి తీరుతామని స్పష్టం చేశారు. దీని ద్వారా రాష్ట్రానికి మేలు జరుగుతుందని, ఒకవేళ అమలు చేయలేకపోతే నా జీవితంలో శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టనని శపథం చేశారు. నా ఊర్లో కూడా అడుగు పెట్టను. నా ఇల్లు, ఆస్తులు, అన్నీ ఇక్కడే ఉన్నాయి. 62 ఏళ్లుగా అక్కడే జీవిస్తున్నాను అని రఘువీరా రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన సందర్భంగా నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.