టీడీపీలో 'కోట్ల' ఇమడలేరు..!

టీడీపీలో 'కోట్ల' ఇమడలేరు..!

కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి... పార్టీని వీడటం దురదృష్టకరం అన్నారు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. ప్రాంతీయ పార్టీలో కోట్ల ఇమడడం కష్టమన్నారాయన. మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా నంద్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కోట్ల టీడీపీలో చేరితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీయే కీలకంగా మారుతుందని.. కాంగ్రెస్ మద్దతుదారులే సీఎం కుర్చీలో ఉంటారని ధీమా వ్యక్తం చేశారు రఘువీరారెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ దుష్టపలనకు అంతం కావడమే కాంగ్రెస్‌తో కూడిన ఫ్రంట్ లక్ష్యమన్న పీసీసీ చీఫ్.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీలో విభజన హామీలతో పాటు హోదా ఇస్తామని స్పష్టం చేశారు.