'రాహుల్‌ పర్యటనతో వెయ్యి ఏనుగుల బలం..'

'రాహుల్‌ పర్యటనతో వెయ్యి ఏనుగుల బలం..'

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన భరోసా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందన్నారు పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... ఏపీకి ప్రత్యేక హోదా జాతీయ అజెండాగా చేస్తానని  రాహూల్ చెప్పారని.. ప్రధానిగా తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్‌ పైనే చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు రఘువీరారెడ్డి. ఇక గోవాకు ప్రత్యేక హోదాను ఇస్తామని బీజేపీ ఉపాధ్యక్షుడు చెబుతారు... కానీ, ఏపీకి మాత్రం లేదంటారని మండిపడ్డారు. మరోవైపు ప్రత్యేక హోదా భరోసా యాత్ర మార్చి 31 వరకు కొనసాగుతుందని తెలిపారు.