ఇంటర్ ఫలితాలే టీఆర్‌ఎస్‌ పాలనకు నిదర్శనం..

ఇంటర్ ఫలితాలే టీఆర్‌ఎస్‌ పాలనకు నిదర్శనం..

ఇంటర్మీడియట్ ఫలితాలే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్ఎస్) పాలనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటర్ పరీక్షలల్లో ప్రభుత్వం, ఇంటర్ బోర్డ్ ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. ప్రభుత్వ, ఇంటర్ బోర్డు తీరుతో 10 లక్షల మంది విద్యార్థులు మానసిక క్షోభలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఉత్తమ్... పేపర్ మూల్యంకాన గతం కన్నా ఎందుకు భిన్నంగా చేశారు.. ఔట్ సోర్సింగ్ తో ఎందుకు మూల్యాంకన చేశారని ప్రశ్నించారు. ఇంటర్ ఫలితాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ వ్యవహారంపై గవర్నర్‌ నరసింహన్‌ దగ్గరకు వెళ్తామని... అఖిల పక్షంగా వెళ్లి విద్యాశాఖ మంత్రి బర్తరఫ్‌ చేయాలని కోరతామన్నారు. ఇంటర్ విద్యార్థులవి 19 ఆత్మహత్య లా?, ప్రభుత్వ హత్యలా? ప్రజలు ఆలోచించాలన్నారు ఉత్తమ్... చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేసిన ఆయన.. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థుల పేపర్స్ అన్ని ఉచితంగా రీ-వాల్యుయేషన్ చేయాలని డిమాండ్ చేశారు.