'ఓటమిపై అడిగి తెలుసుకున్న రాహుల్..'

'ఓటమిపై అడిగి తెలుసుకున్న రాహుల్..'

ఏపీ, తెలంగాణ నేతలతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్వహించిన సమావేశం ముగిసింది... అనంతరం మీడియాతో మాట్లాడిన తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి... తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇటీవల నియామకమైన కమిటీల సభ్యులతో రాహుల్ గాంధీ మాట్లాడారని వెల్లడించారు. తెలంగాణలో ఓటమి గురించి పార్టీ అధ్యక్షుడు అడిగి తెలుసుకున్నారన్న ఉత్తమ్... సార్వత్రిక ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించామని తెలిపారు. రెండు మూడు రోజుల్లో మరోసారి ఏఐసీసీ కార్యదర్శులు, ఇంచార్జి, పీసీసీ అధ్యక్షుడితో రాహుల్ గాంధీ సమావేశమవుతారని తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.