పార్టీ చీఫ్‌తో ఉత్తమ్ భేటీ...

పార్టీ చీఫ్‌తో ఉత్తమ్ భేటీ...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది... ఇక రేపు ఫలితాలు వెలువడనున్నాయి. గెలుపుపై ఇటు టీఆర్ఎస్, అటు ప్రజాకూటమి ధీమాతో ఉన్నాయి. ఎవరిలెక్కలు వారు వేసుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర నేతలు ఓ అంచనాకు రాగా... ఇవాళ ఢిల్లీ వెళ్లిన తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఎన్నికల తర్వాత పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ప్రజాకూటమి అభ్యర్థుల విజయావకాశాలు? ఫలితాలును బట్టి అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించినట్టు సమాచారం. మరోవైపు పోలింగ్ తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌పై సమాలోచనలు చేసినట్టు తెలుస్తోంది.