'విద్యాశాఖ మంత్రిని భర్తరఫ్ చేయండి..!'

'విద్యాశాఖ మంత్రిని భర్తరఫ్ చేయండి..!'

తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు వివాదాస్పదమయ్యాయి. అధికారుల నిర్లక్ష్యమై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఇంటర్ బోర్డు ముందు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, తెలంగాణ విద్యాశాఖ మంత్రిని భర్తరఫ్‌ చేయాలని డిమాండ్ చేశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి... ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు లేఖ రాసిన ఉత్తమ్.. ఫలితాల్లో అవకతవకలకు కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుందామనే ధ్యాసే తప్పితే.. ప్రజల సమస్యలు ఎప్పుడు పట్టించుకున్నారని మండిపడ్డ ఉత్తమ్... అవినీతి ప్రక్షాళన అని ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్... ఇంటర్మీడియట్ బోర్టుని ఎందుకు ప్రక్షాళన చేయరు అని ప్రశ్నించారు. మరోవైపు రాజకీయ అవినీతిని సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. 10 లక్షల మంది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాల్సింది ఇలాగేనా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.