దేశద్రోహ చట్టం కింద ముఫ్తీని అరెస్ట్‌ చేయండి

దేశద్రోహ చట్టం కింద ముఫ్తీని అరెస్ట్‌ చేయండి

జమ్మూ-కశ్మీర్‌లో ప్రత్యేక జెండాను ఎగరేయడానికి అనుమతి ఇచ్చినపుడే జాతీయ జెండాను ఎగరేస్తానని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించే వరకు జాతీయ జెండాను ఆవిష్కరించనని చెప్పిన మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దేశ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. బీజేపీ అధ్యక్షుడు రవీందర్ స్పందిస్తూ.. మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాను కోరారు. ఆమె వ్యాఖ్యలు దేశద్రోహం పరమైనవి. దేశద్రోహ చట్టం కింద అరెస్ట్ చేయాలంటూ, జమ్మూ-కశ్మీర్ దేశంలో అంతర్భాగం కాబట్టి జాతీయ జెండాను ఎగరేయాలి’ అని తెలిపారు.