ఆ మార్గంలోనే ఆర్టికల్ 370ని తిరిగి సాధించాలి... 

ఆ మార్గంలోనే ఆర్టికల్ 370ని తిరిగి సాధించాలి... 

ఆగష్టు 5, 2019 న జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసింది.  జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని లడఖ్, జమ్మూ కాశ్మీర్ లుగా విభజించింది.  లడఖ్ కు చట్టసభలు లేని రాష్ట్రంగా, చట్టసభలలో కూడిన రాష్ట్రంగా జమ్మూ కాశ్మీర్ ను ఏర్పాటు చేసింది.  ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూ కాశ్మీర్ లో హైడ్రామా నడిచింది.  జమ్మూ కాశ్మీర్ కు చెందిన పలువురు నేతలను గృహనిర్బంధంలో ఉంచారు.  కొన్ని రోజుల క్రితం ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలను గృహనిర్బంధం నుంచి విడుదల చేయగా, నిన్నటి రోజున పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తిని గృహనిర్బంధం నుంచి విడుదల చేశారు.  విడుదల తరువాత జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం పోరాటం చేస్తామని, శాంతియుత మార్గంలోనే పోరాటం చేస్తామని మెహబూబా ముఫ్తి పేర్కొన్నారు.  ఆర్టికల్ 370ని తిరిగి సాధించడం ఈజీ కాకపోయినా పోరాటం చేసి సాధిస్తామని ముఫ్తి పేర్కొన్నారు.  అనేక మంది నేతలు ఇంకా గృహనిర్బంధంలోనే ఉన్నారని, వారిని కూడా విడుదల చేయాలని ముఫ్తి డిమాండ్ చేశారు.