ప్రశాంతంగా చంద్రగిరి రీపోలింగ్ 

ప్రశాంతంగా చంద్రగిరి రీపోలింగ్ 

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రీపోలింగ్ జరిగిన 7 పోలింగ్ బూత్ ల్లో 89.29 శాతం ఓటింగ్ నమోదైంది. ఏప్రిల్ 11న జరిగిన ఓటింగ్ శాతం 90.42గా నమోదైంది. రీపోలింగ్ దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడక్కడా చెదురుముదురు ఘటనలు మినహా రీపోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి 250 మంది పోలీసులు, ఒక ఐపీఎస్‌ స్థాయి అధికారి పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ఫలితాలు ఈ నెల 23 న వెలువడనున్నాయి.