రివ్యూ : పెదవి దాటని మాటొకటుంది..

రివ్యూ : పెదవి దాటని మాటొకటుంది..

నటీనటులు : రావన్ రెడ్డి, పాయల్ వాద్వా, నరేష్ 

సంగీతం : జెనిత్ రెడ్డి 

ఫోటోగ్రఫి : నయన్, యతిన్ 

నిర్మాత : అదితి, కీర్తి కుమార్ 

దర్శకత్వం : గురుప్రసాద్ 

రిలీజ్ డేట్ : 27-07-2018

పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో పెదవి దాటని మాటొకటుంది అనే పాట ఎంత హిట్ అయిందో అందరికి తెలిసిందే.  ఈ పాటలోని పల్లవిని తీసుకొని కొత్త దర్శకుడు గురు ప్రసాద్ కొత్త నటులు రావన్ రెడ్డి, పాయల్ వాద్వాలతో పెదవి దాటని మాటొకటుంది సినిమా చేశాడు.  ట్రైలర్ తో ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాను ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారో చూద్దామా.  

కథ : 

రావన్ రెడ్డికి చదువంటే ఇష్టం ఉండదు.  మంచి మ్యూజిషియన్ కావాలన్నది అతని కల.  ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునే క్రమంలో రావన్ సాఫ్ట్ వేర్ కంపెనీలో బిల్డింగ్ క్లీనర్ గా జాయిన్ అవుతాడు.  ఇదిలా ఉంటె చిన్నతనంలో స్కూల్ డేస్ పాయల్.. రావన్ చూసి ఇష్టపడుతుంది.  ఈ విషయాన్ని రావన్ కు చెప్తే.. ఎగతాళి చేస్తాడు. అందంగా లేవని ఆటపట్టిస్తాడు.  దీనికి సీరియస్ గా తీసుకున్న పాయల్, పెద్దయ్యే సరికి అందంగా మారుతుంది.  పెద్దయ్యాక రావన్.. పాయల్ ను చూసి ఆశ్చర్యపోతాడు.  ఆమెను ప్రేమిస్తాడు.  ఆ విషయాన్ని పాయల్ కు చెప్పేందుకు ధైర్యం చేయలేడు.  ప్రేమించిన విషయాన్ని అవతలి వాళ్లకు చెప్పలేకపోవడం ఒక మానసిక వ్యాధి వంటిదే.  దీనినే కుపిడ్ డిజాస్టర్ అంటారు.  మరి రావన్ ఈ డిజాస్టర్ నుంచి బయటపడ్డాడా.. ? లేదా ? పాయల్ కు తన ప్రేమ గురించి ఎలా చెప్పాడు అన్నది చిత్రకథ.  

విశ్లేషణ : 

కుపిడ్ అనే కాన్సెప్ట్ తో కొత్తగా కథను రాసుకున్న దర్శకుడు దానిని ప్రెజెంట్ చేయడంలో విఫలం అయ్యాడు.  ఫస్ట్ హాఫ్ సరదాసరదాగా తీసుకెళ్లిన.. సెకండ్ హాఫ్ దగ్గరి వచ్చే సరికి పూర్తిగా పట్టును కోల్పోయాడు.  సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు విసుగు తెప్పించాయి.  హీరో లక్ష్యం మ్యూజిషియన్ కావడం.. ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు అనే దానిపై దర్శకుడు కొద్దిగా కాన్సట్రేట్ చేసి మంచి కథనాలు రాసుకొని ఉంటె బాగుండేది.  లక్ష్యాన్ని పక్కన పెట్టి ప్రేమ చుట్టూనే కథను నడపడంతో సినిమా రొటీన్ గా మారిపోయింది.  సీనియర్ నటుడు నరేష్ పండించిన హాస్యం బాగుంది.  హీరో తండ్రి పాత్రలో నరేష్ మరోసారి మెప్పించాడు.  పాయల్ అందంగా కనిపించింది.   

సాంకేతికం : 

మంచి కాన్సెప్ట్ ను ఎంచుకున్న దానిని తెరపై చూపించే విధానంలో దర్శకుడు విజయం సాధించలేకపోయాడు.  సినిమా చూడటానికి రెండు గంటల షార్ట్ ఫిలింలా ఉంది.  కమర్షియల్ అంశాల జోలికి వెళ్లకుండా తక్కువ బడ్జెట్ తో మంచి సినిమా తీయాలన్న ప్రయత్నం బెడిసికొట్టింది.  జెనిత్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.  పాటలు బాగున్నాయి.  నయన్, యతిన్ ఫోటో గ్రఫీ ఆకట్టుకుంది.  ముఖ్యంగా పాయల్ ను తెరపై అందంగా చూపించారు.  

పాజిటివ్ పాయింట్స్ : 

నరేష్ 

ఫొటోగ్రఫీ 

సంగీతం 

మైనస్ పాయింట్స్ : 

కథనాలు 

ఎడిటింగ్ 

హీరో, హీరోయిన్ 

సెకండ్ హాఫ్ 

చివరిగా : మాట పెదవిని దాటలేకపోయింది.