పెద్దగట్టు జాతర: హైదరాబాద్-విజయవాడ వాహనాల దారిమళ్లింపు 

పెద్దగట్టు జాతర: హైదరాబాద్-విజయవాడ వాహనాల దారిమళ్లింపు 

రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరగా చెప్పుకునే పెద్దగట్టు జాతర ఈరోజు నుంచి ప్రారంభం కాబోతున్నది.  సూర్యాపేట సమీపంలోని పెద్దగట్టు దురాజ్ పల్లిలో జాతర జరుగుతుంది.  ఐదు రోజులపాటు జరిగే ఈ జాతరలో దాదాపుగా 15 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.  దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాలను దారిమళ్లిస్తున్న.  విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లేవారు కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, నల్గొండ, నార్కెట్ పల్లి మీదుగా, హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలను నార్కెట్ పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ మీదుగా మళ్లిస్తున్నారు.  జాతర పూర్తయ్యే వరకు వాహనాల దారిమళ్లింపు ఉంటుంది.