ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం

ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఇంట తీవ్ర విషాదం

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోదరి కుటుంబ సభ్యులు అలుగునూర్ కెనాల్‌లో శవాలుగా తేలారు. 20 రోజుల క్రితం మిస్సైన రాధిక కుటుంబ సభ్యులను ఇవాళ ఉదయం కెనాల్‌లో గుర్తించారు పోలీసులు. నిన్నసాయంత్రం కెనాల్‌లో ఓ బైక్‌ పడటంతో నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. దీంతో కెనాల్‌లో కారు బయటపడింది. కారులో కుళ్లిపోయిన స్థితిలో ముగ్గురి మృతదేహాలు ఉన్నట్లు గుర్తించగా, కారు నెంబర్‌ ఆధారంగా వారిని పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి కుటుంబంగా తేల్చారు. గత నెల 27 నుంచి రాధిక కుటుంబం కనిపించడం లేదని తెలుస్తోంది.  సంఘటనా స్థలానికి కలెక్టర్‌తో పాటూ సీపీ చేరుకున్నారు. మిస్సింగ్ తమ వద్ద ఎలాంటి మిస్సింగ్ కేసు నమోదు కాలేదని సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. కారులో ఎమ్మెల్యే సోదరి రాధికతోపాటూ, ఆమె భర్త సత్యనారాయణ రెడ్డి, కూతురు సహస్త్ర ఉన్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామన్నారు సీపీ.
తన సోదరి కుటుంబం తరచూ విహారయాత్రలకు వెళ్తూ ఉంటారని, ఇప్పుడు కూడా అలాగే వెళ్లి ఉంటారని భావించినట్లు చెప్పారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. కారు లభ్యమైన అలుగనూర్ కెనాల్ వద్దకు వచ్చిన ఎమ్మెల్యే....సీపీతో పాటూ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.