రిజల్ట్‌కు ముందే వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు..!?

రిజల్ట్‌కు ముందే వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు..!?

సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ముగిసింది.. అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అందరిలో ఉత్కంఠరేపాయి. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గెలుపుపై ధీమాతో ఉన్నారు. తామే గెలుస్తామంటే.. లేదు.. ఈ సారి మాదే అధికారం అంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు.. తొడలు కొట్టుకోవడం.. ఇలా సాగిపోతోంది. అయితే, ఎన్నికల ఫలితాలు రేపు (మే23వ) వెలువడనున్న సమయంలో.. తాడేపల్లిలో వెలసిన ఓ ఫ్లెక్సీ చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఓట్ల లెక్కింపు ప్రారంభం కాకముందే..! ఫలితాలు వెల్లడించకముందే..! పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన ఓ వైసీపీ నేత... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయబోతున్న గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి గారికి శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కాగా, ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియగానే.. ‘వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి’ అంటూ తెలుగు, ఇంగ్లీష్‌లో రాసిన నేమ్ బోర్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.