'బెట్టింగ్స్ కోసమే లగడపాటి సర్వేలు..!'

'బెట్టింగ్స్ కోసమే లగడపాటి సర్వేలు..!'

లగడపాటి రాజగోపాల్ సర్వేపై సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి... చిత్తూరు జిల్లాలో రీపోలింగ్ జరుగుతోన్న వెంకట్రామపురం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో మూడు ఎంపీ స్థానాలు, మెజారిటీ అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 120 నుంచి 135 స్థానాల్లో వైసీపీ విజయ ఢంకా మోగిస్తుందనే నమ్మకం ఉందన్నారు. లగడపాటి సర్వేలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న పెద్దిరెడ్డి.. బెట్టింగ్స్ కోసమే లగడపాటి సర్వేలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పిన లగడపాటి... ఇప్పుడు టీఆర్ఎస్ వైపు మాట్లాడుతున్నారని విమర్శించారు.