నేనే గెలుస్తా.. ఎంత పందెనికైనా రెడీ !

నేనే గెలుస్తా.. ఎంత పందెనికైనా రెడీ !

 

ఎన్నికలు ముగియడంతో ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.  అభ్యర్థులు ఎవరికి వారు గెలుపు తమదేనని ధీమాగా ఉన్నారు.  అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణ ఈసారి కూడా తానే గెలుస్తానని అంటున్నారు.  అంతేకాదు తన గెలుపుపై ఎంత పందెం కాయడానికైనా సిద్ధమేనని ఛాలెంజ్ చేస్తున్నారు.  అనకాపల్లిలో జరిగిన అభివృద్ధి చూసిన మహిళలు ఎంతో సంతోషిస్తున్నారని తెలిపారు.  వైకాపా నేతలు ఎక్కువగా   ఊహించుకుని ఏవేవో మాట్లాడుతున్నారని రాష్ట్రంలో టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని అన్నారు.