అందుకు కారణం అతడేనట

అందుకు కారణం అతడేనట

ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఇప్పుడు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతోంది. మాస్‌మహరాజ్ రవితేజ, దర్శకుడు రమేష్ వర్మ జోడీలో రూపొందనున్న ‘ఖిలాడి’ సినిమాను నిర్మించేందుకు పెన్ స్టూడియోస్ ముందుకొచ్చింది. ఇదేవిధంగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు బెల్లం కొండ శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నాడు. అందుకుగాను తెలుగులో భారీ విజయం సాధించిన ‘ఛత్రపతి’ సినిమాని వివి వినాయక్ దర్శకత్వంలో హిందీలో చిత్రించనున్నారు. ఈ సినిమాను నిర్మించేందుకు కూడా పెన్ స్టూడియోస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇన్నాళ్లు లేనిది ఒక్క సారిగా పెన్ స్టూడియోస్‌కు టాలీవుడ్‌పై ఆసక్తి ఎందుకంటే అనూప్ సింగ్ ఠీకూర్ అంటున్నారు. సినిమాల్లో విలన్ పాత్రలు చేసే అనూప్‌కు పెన్ స్టూడియోస్‌కు మంచి అనుబంధం ఉందని, దాని కారణంగానే అనూప్ రెఫర్ చేయడంతో టాలీవుడ్ సినిమాలు నిర్మించేందుకు పెన్ స్టూడియోస్ ముందుకొస్తోందని సమాచారం. శ్రీనివాస్ ‘ఛత్రపతి’, రవితేజ ఖిలాడీ సినిమాలకు పెన్ స్టూడియోస్  పెట్టుబుడులు పెట్టేందుకు ఒప్పుకొవడం కూడా అనూప్ నేతృత్వంలో జరిగిందట. దీనితో పాటుగా తెలుగు, తమిలంలో సూపర్ హిట్ అయిన రాక్షసుడు సినిమాను హిందీలో తీసేందుకు కూడా పెన్ స్టూడియోస్ ఆసక్తి చూపుతోంది. ఇదిలా ఉంటే ఛత్రపతి రీమేక్‌లో అనూప్ విలన్ పాత్ర చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజులలో ప్రారంభం కానుంది.