వామ్మో...అక్కడ పురుషాంగాలకు పూజలు చేస్తారట !

వామ్మో...అక్కడ పురుషాంగాలకు పూజలు చేస్తారట !

కొన్ని దేశాల్లో పాటించే ఆచారాల గురించి తెలిస్తే అమ్మో, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది. కొన్ని సాంప్రదాయాల గురించి తెలిస్తే ఒళ్లుగగూర్పాటు కలుగుతుంది. అందులో ఒకటే జపాన్‌ ప్రజలు ఘనంగా జరుపుకునే ఉత్సవం - కనమార మాట్సురి. తెలుగులో దీనిని లింగమహోత్సవం" గా చెప్పవచ్చు. ఆ రోజు అక్కడ ఏ వస్తువు చూసినా పురుషాంగం అంటే లింగాలనే గుర్తుకు తెస్తాయి. తినే ఆహారం నుంచి వారు పెట్టుకునే టోపీల వరకు ప్రతి ఒక్కటీ "పురుషాంగాల రూపం" లోనే ఉంటాయి. ఏటా మార్చి నెల రాగానే జపాన్‌ లోని 'హొన్షు ఐల్యాండ్ ' ఈ పండుగకు సిద్ధమై పర్యాటకులతో కిటకిట లాడు తుంది. అక్కడ "నొయగా నగరం"లోని ఐచీ ప్రాంతంలో కొయ్యతో తయారు చేసిన రెండు మీటర్ల పొడవైన పురుషాంగం ప్రతిమ- ఒక లింగ రూప మూర్తిని పూజించే పవిత్ర దేవాలయం వద్ద ఊరేగిస్తారు.

ఈ సందర్భంగా అంతా సాంప్రదాయ వస్త్రాలు ధరించి వేడుకలో పాల్గొంటారు. సంతానం లేనివారు సంతానం కోసం పరితపించేవారు ఆ పురుషాంగాన్ని ప్రార్థిస్తూ ముద్దు పెట్టు కుంటారు. ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించిన కొత్తలో పురుషాంగం ప్రతిమ చాలా చిన్నది గా ఉండేది. ఏడాదికాయేడు దాని ఆకారాన్ని పెద్దది చేస్తూ ఊరేగించడం ఇక్కడ సాంప్రదాయంగా మారింది. ఈ వేడుకలో భాగంగా అక్కడి ఆహార పదార్ధాలను, కూరగాయలను, అలంకారాలను, బొమ్మలను చాకోలేట్లను, కాండీలను సైతం పురుషాంగాల రూపంలోనే తయారు చేస్తారు. అరటి పండ్లను చాక్లెట్ రసంలో ముంచి విక్రయిస్తారు. ఈ పండుగ నిర్వహణ 1969లో ప్రారంభించారు. ఇప్పుడు ఇది ఒక మహోత్సవంగా మారింది.