ఏలూరు జనసేన అభ్యర్థిగా పుల్లారావు

ఏలూరు జనసేన అభ్యర్థిగా పుల్లారావు

ఏలూరు జనసేన ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ పెంట‌పాటి పుల్లారావు పోటీ చేస్తారని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇప్పటికే నలుగురు ఎంపీ అభ్యర్థులు, 32 మంది 32 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన పవన్‌.. నిన్న రాత్రి పుల్లారావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. విదేశాల్లో చదువుకున్న పుల్లారావు.. పోలవరం నిర్వాసితుల కోసం ఎంతో పోరాటం చేశారని.. ముఖ్యంగా గిరిజనులకు అండగా నిలబడ్డారని  పవన్‌ అన్నారు. పెంటపాటి పుల్లారావు ఎంపీగా పోటీ చేయడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. 'మీ విజయం పోలవరం బాధితుల విజయం. సగటు మధ్యతరగతి వ్యక్తి విజయం. రాజకీయ విలువలున్న మీలాంటి వ్యక్తులు పార్లమెంట్‌కు వెళ్లాలి' అని పవన్ ఆకాంక్షించారు.