శభాష్ పోలీస్

శభాష్ పోలీస్

గత నెల 27 వ తేదీన దిశ అత్యాచారం,హత్య కేసు తరువాత దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.  దిశపై అత్యాచారం హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకున్నా, నిందితులకు శిక్ష పడుతుందా లేదా అన్నది డౌట్ గా ఉన్నది.  కానీ, ఆ డౌట్ ను పటాపంచలు చేస్తూ.. పోలీసులు చటాన్ పల్లి అండర్ పాస్ వద్ద నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు.  

నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్న సమయంలో వారిని కాల్చి చంపారు.  దీంతో ప్రజలు పెద్ద ఎత్తున చటాన్ పల్లి అండర్ పాస్ వద్దకు చేరుకొని పోలీసులకు హ్యాట్సాఫ్ చెప్పారు.  పోలీసులపై ప్రజలు పూలవర్షం కురిపించారు.    శభాష్ పోలీస్ అంటూ మెచ్చుకుంటున్నారు.