ఎన్డీఏను దించేందుకు ప్రజలంతా ఏకం కావాలి 

ఎన్డీఏను దించేందుకు ప్రజలంతా ఏకం కావాలి 

బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించేదుకు ప్రజలంతా ఏకం కావాలని సౌత్ ఇండియా చర్చ్ (సీఎస్ఐ) పిలుపునిచ్చింది. బీజేపీ తీసుకున్న పలు పథకాలతో సీఎస్ఐ విభేదించింది. ఆ పథకాలన్నీ ప్రజలకు ఉపయోగపడేవి కావని తేల్చింది. ఇవన్ని కార్పోరేట్ వర్గాలకు అనుకూలంగా ఉన్నాయనీ, పేద వర్గాలకు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించింది. ఈ మేరకు సీఎస్ఐ చర్చ్ చీఫ్, బిషప్ థామస్ కె.ఓమెన్ దేశ ప్రజలందరికి బహిరంగ లేఖ రాశారు. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏకం కావాలని ఆ లేఖలో పిలుపునిచ్చారు. గాంధీ దండి మార్చ్ తో బ్రిటీష్ సామాజ్రాన్ని ఎలా గడగడలాడించారో... అదే విధంగా మోడీ ప్రజా వ్యతిరేక పథకాలపై పోరాటం చేయాలన్నారు. ఈ ప్రభుత్వ హాయాంలో మైనారిటీలు, దళితులపై దాడులు పెరిగాయని విమర్శించారు. కొన్ని వర్గాలు తమ అభిప్రాయాలను చెప్పేందుకే భయపడుతున్నాయని వెల్లడించారు. మన రాజ్యాంగం సార్వభౌమాధికార, సామ్యవాద, సెక్యులర్, డిమోక్రటిక్ రిపబ్లిక్  అయినా...కేంద్రం రాజ్యంగానికి విరుద్ధంగా పాలనసాగిస్తోందని వెల్లడించారు. కేంద్రం ప్రభుత్వం హిందుత్వ అజెండాతో పాలన సాగిస్తోందని బిషప్ విమర్శించారు.