రికార్డు కాని కోర్టు పరిశీలనలు రాజకీయ ర్యాలీల్లో వాడొద్దు 

రికార్డు కాని కోర్టు పరిశీలనలు రాజకీయ ర్యాలీల్లో వాడొద్దు 

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తరచుగా రఫెల్ కేసు తీర్పులో తమ పరిశీలనలను రాజకీయ ర్యాలీల్లో ప్రస్తావించడంపై సుప్రీంకోర్ట్ సీరియస్ గా అయింది. రఫెల్ ఫైటర్ జెట్ కేసు గురించి చెప్పేటపుడు రాహుల్ గాంధీ తరచుగా 'చౌకీదార్ చోర్ హై' అంటూ తమ పరిశీలనలను అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్టు తప్పుగా ఆపాదిస్తున్నారని సోమవారం స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై ఏప్రిల్ 22లోగా తన వివరణ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షుడిని ఆదేశించింది.

'మీడియాలో, బహిరంగ సభల్లో రాజకీయ ప్రసంగం చేసేటపుడు ఏ అభిప్రాయాలు, పరిశీలనలు, కనుగొనబడిన విషయాలను కోర్టుకు ఆపాదించరాదు. ఆయా అభిప్రాయాలు, పరిశీలనలు, కనుగొనబడిన విషయాలు కోర్టు రికార్డు చేస్తేనే వాటి గురించి మాట్లాడవచ్చని' కోర్టు విస్పష్టంగా తెలిపింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ఈ కేసు విచారణను ఏప్రిల్ 23కి వాయిదా వేసింది. 

ఒప్పందానికి సంబంధించిన రహస్య పత్రాలు చోరీ చేసి కొన్ని వార్తాపత్రికల్లో అనుమతి లేకుండా ప్రచురించారన్న ప్రభుత్వ వాదనను తిరస్కరిస్తూ రఫెల్ డీల్ కి సంబంధించిన కేసును కొత్తగా విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించిన తర్వాత రాహుల్ గాంధీ కొన్ని వ్యాఖ్యలు చేశారు.