ఒక్క ఇన్నింగ్స్‌తో 58 ర్యాంకులు జంప్‌

ఒక్క ఇన్నింగ్స్‌తో 58 ర్యాంకులు జంప్‌

టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో ఒక్కో ర్యాంకు పైకెళ్లడమంటనే మహా కష్టం. అటువంటిది ఒకేసారి 58 స్థానాలు ఎగబాకాడు శ్రీలంక మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ కుశాల్‌ పెరీరా. డర్బన్‌ టెస్ట్‌లో చారిత్రక ప్రదర్శన చేయడంతో  98వ ర్యాంకు నుంచి ఏకంగా 40వ స్థానానికి చేరుకున్నాడు. డర్బజ్‌ టెస్ట్‌లో పదో వికెట్‌కు అజేయంగా 78 పరుగులు జోడించి కుశాల్ పెరీరా (153 నాటౌట్) శ్రీలంకకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.