ఎమ్మెల్యేలకు స్వీట్స్‌.. మంత్రి పేర్ని నాని స్పెషల్‌

ఎమ్మెల్యేలకు స్వీట్స్‌.. మంత్రి పేర్ని నాని స్పెషల్‌

కొత్త సభ కొలువుదీరింది. ఏపీ శాసనసభ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలిరోజు అసెంబ్లీ లాబీల్లో సభ్యుల సందడి కనిపించింది. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. కొంతమంది కరచాలనం చేసుకున్నారు. ఇక.. మంత్రి పేర్ని నాని.. సభ్యులందరికీ ప్రత్యేకంగా తయారు చేయించిన స్వీట్‌ బాక్స్‌లు పంపిణీ చేశారు. జగన్‌ ఫొటోను  స్వీట్‌ ప్యాక్‌ను ఆకర్షణీయంగా రూపొందించారు.