మైనర్ పై గ్యాంగ్ రేప్... ఢిల్లీ సీఎం సీరియస్.!

మైనర్ పై గ్యాంగ్ రేప్... ఢిల్లీ సీఎం సీరియస్.!

ఢిల్లీ లో మంగళవారం 12ఏళ్ల బాలిక పై నలుగురు యువకులు హత్యాచారం చేసి దారుణంగా దాడిచేశారు. ప‌శ్చిమ విహార్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తల్లి తండ్రులు పనికి వెళ్లటంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో యువకులు ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెను బయటకు రాకుండా భందించి హత్యాచారం చేసి కత్తులతో పొడిచారు. కాగా సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో బాలిక గాయాలతో బయటకు వచ్చింది.  ఆమెను చూసిన స్థానికులు వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాలిక ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా గురువారం ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఘటనపై పోలీస్‌ కమిషనర్‌తో మాట్లాడినట్టు తెలిపారు. ఈ ఘోరమైన నేరానికి పాల్పడిన వారికి కఠినమైన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతే కాకుండా బాలిక కుటుంబ సభ్యులకు పది లక్షల రూపాయల సహాయాన్ని అందజేస్తామన్నారు.