మొదటి వన్డేకు జట్టు ఇదే

మొదటి వన్డేకు జట్టు ఇదే

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జనవరి 12న సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య మొదటి వన్డే జరగనుంది. ఈ వన్డే కోసం ఆస్ట్రేలియా తుది జట్టుని ప్రకటించింది. 2010లో చివరిసారిగా ఆసీస్ వన్డే జట్టుకు ఆడిన ఫాస్ట్ బౌలర్ పీటర్ సిడిల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. టెస్ట్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజాకు చోటు దక్కింది. ఇక వికెట్ కీపర్‌గా అలెక్స్ క్యారీ‌ ఎంపికయ్యాడు. షాన్ మార్ష్, మ్యాక్స్‌వెల్, హ్యాండ్స్‌ కబ్, స్టాయినిస్ లు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. ఒక స్పిన్నర్ గా నాథన్ లయన్ ఎంపికయ్యాడు.

జట్టు:

అరోన్ ఫించ్ (కెప్టెన్), అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, హ్యాండ్స్‌ కబ్, స్టాయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, నాథన్ లయన్, పీటర్ సిడిల్, రిచర్డ్ సన్, బెరెండ్రాఫ్.