ఇంటర్‌ ఫలితాలపై హైకోర్టులో పిటిషన్

ఇంటర్‌ ఫలితాలపై హైకోర్టులో పిటిషన్

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలపై బాలల హక్కుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫలితాల్లో తప్పులకు ఇంటర్ బోర్డు బాధ్యత వహించాలని, బాధ్యులపై సెక్షన్‌ 304 కింద కేసు నమోదు చేయాలని, చనిపోయిన 16 మంది విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని పిటిషనర్‌ కోరుతున్నారు. ఎలాంటి ఫీజు లేకుండా పేపర్ రేవాల్యుయేషన్ చేయాలని, గ్లోబరిన్ టెక్నాలజీ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టి సంస్థపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా పిటిషనర్‌ చేర్చారు. ఈ పిటిషన్‌ను ఇవాళ మధ్యాహ్నం 2.15కి కోర్టు విచారించనుంది.