తీరాన్ని తాకిన పెథాయ్

తీరాన్ని తాకిన పెథాయ్

అమలాపురానికి 20 కిలోమీటర్ల దూరంలోని కాట్రేనికోన వద్ద పెథాయ్‌ తుపాన్‌ తీరాన్ని తాకింది. ఈ తాకిడి 80 కిలోమీటర్ల వేగంతో ప్రఛండ గాలులు వీస్తున్నాయి. గాలుల ధాటికి పలు చోట్ల చెట్లు నేలకూలాయి. రోడ్లు జలమయయ్యాయి. దీని ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాల్లో  భారీ వర్షాలు కుస్తున్నాయి. ప్రధానంగా తూర్పు గోదావరి జిల్లాలో భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి.

భారీగా ఆస్తి నష్టం
పెథాయ్‌ తాకిడికి భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా కాకినాడ, యానాం మధ్య పెనుగాలుల విధ్వంసంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.