ప్రగతి నివేదన సభపై హైకోర్టులో పిటిషన్

ప్రగతి నివేదన సభపై హైకోర్టులో పిటిషన్

సెప్టెంబర్‌ 2న కొంగరకలాన్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రగతి నివేదన సభ జరపకుండా చూడాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సభకు అనుమతి ఇవ్వకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది, పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పూజారి శ్రీధర్ పిటిషన్ వేశారు. దీనిపై రేపు హైకోర్టు విచారణ జరపనుంది. ప్రభుత్వం తన నివేదికను ప్రకటించాలనుకుంటే నూతన టెక్నాలజీ ద్వారా, సాంఘిక మాద్యమాల ద్వారా చేయాలని.. ప్రజలకు, పర్యావరణ పరిరక్షణకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పిటిషన్‌లో ఆయన తెలిపారు.