వేములవాడ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రద్దుకు హైకోర్టులో పిటిషన్

వేములవాడ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల రద్దుకు హైకోర్టులో పిటిషన్

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్ల ప్రక్రియ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన జరగలేదని వేములవాడ ఎంపీపీ రంగు వెంకటేష్ దాఖలు చేశారు. తాజా జనాభా లెక్కల ప్రాతిపదికన రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన పిటిషన్ లో కోరారు. రేపు హైకోర్టు ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది.