దసరా సెలవుల పొడిగింపు.. హైకోర్టులో పిటిషన్..

దసరా సెలవుల పొడిగింపు.. హైకోర్టులో పిటిషన్..

తెలంగాణలో ఓవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోన్న సమయంలో.. దసరా సెలవులు ముగుస్తున్న తరుణంలో మరో వారం రోజుల పాటు సెలవులను పొడిగించింది కేసీఆర్ సర్కార్.. దీంతో, అదనంగా మరో వారం రోజులు స్కూళ్లు మూతపడే పరిస్థితి.. అయితే, ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారు కసిరెడ్డి శశిధర్, ఆయన కుమారుడు. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చలగాటం ఆడుతోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం విచారణకు అనుమతించింది హైకోర్టు. దసరా సెలవుల తర్వాత ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ నెల 19వ తేదీ వరకు సెలవులను పొడిగించింది.. ఈ నిర్ణయంతో ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటుకుంటోందని.. చదువులు దెబ్బతినే పరిస్థితి వచ్చిందని.. వెంటనే స్కూళ్లు తెరిచేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరి ఇవాళ మధ్యాహ్నం ఈ పిటిషన్‌పై విచారణ ప్రారంభంకానుండగా.. హైకోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.