బీజేపీ అభ్యర్ధి కిషన్ రెడ్డిపై హైకోర్టులో పిటిషన్

బీజేపీ అభ్యర్ధి కిషన్ రెడ్డిపై హైకోర్టులో పిటిషన్

బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. రూ.2 లక్షల కంటే ఎక్కువ నగదు విత్ డ్రా చేయకూడదని ఆర్‌బీఐ నిబంధన ఉంది. కానీ.. ఆ నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ నాయకులు బ్యాంక్ నుంచి రూ. 8 కోట్ల నగదు ఎలా విత్ డ్రా చేస్తారని కొందరు పిటిషన్ దాఖలు చేశారు. రిట్ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరగనుంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని హైకోర్టును వాళ్లు కోరారు.