చేప మందు పంపిణీపై హైకోర్టులో పిటీషన్

చేప మందు పంపిణీపై హైకోర్టులో పిటీషన్

చేపమందు పంపిణీని ఆపాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ నెల 8, 9తేదీల్లో బత్తిన సోదరులు చేపమందు ప్రసాదంను పంపిణీ చేయనున్నారు. హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌‌ను బాలల హక్కుల సంఘం దాఖలు చేసింది. చేప మందుకు ఎలాంటి సైంటిఫిక్‌ అథారిటి లేదని.. దానిని పంపిణీ చేయడం చట్ట విరుద్దమంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. చేప మందు కోసం అనవసరంగా ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని పటిషనర్‌ అభిప్రాయపడ్డారు.