స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో పిటీషన్

స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో పిటీషన్

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలంటూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్ల ఖరారులో అన్యాయం జరిగిందని, బీసీ జనాభా లెక్కించిన తర్వాతే రిజర్వేషన్ల ఖరారు చేయాలని పిటిషనర్‌ కోరారు. మంగళవారం హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.