బీజేపీ కార్పొరేటర్‌పై హైకోర్టులో పిటిషన్‌.. ట్రిబ్యునల్‌కు కీలక ఆదేశాలు

బీజేపీ కార్పొరేటర్‌పై హైకోర్టులో పిటిషన్‌.. ట్రిబ్యునల్‌కు కీలక ఆదేశాలు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు.. ఇవాళే ప్రమాణస్వీకారం చేశారు.. ఇక, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు కూడా జరిగిపోయింది.. అయితే, హస్తినాపురం బీజేపీ కార్పొరేటర్‌ సుజాతపై హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.. కార్పొరేటర్‌ సుజాతకు ముగ్గురు పిల్లలు ఉన్న విషయం... ఎన్నికల అఫిడవిట్‌లో దాచిపెట్టారని.. హైకోర్టును ఆశ్రయించారు మాజీ కార్పొరేటర్ పద్మనాయక్.. దీంతో.. సుజాత ఎన్నికను రద్దు చేయాలని హైకోర్టును కోరారు.. ఇక, సుజాతకు చెందిన ముగ్గురు పిల్లలకు సంబంధించిన ఆధారాలను కూడా హైకోర్టుకు సమర్పించారు పద్మనాయక్.. ఈ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు.. పిటిషనర్ చూపిన ఆధారాలు నిజమైతే... చర్యలు తప్పవని వ్యాఖ్యానించింది. మూడు నెలల్లోగా ఈ పిటిషన్ పై విచారణ పూర్తి చేయాలని ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.