కోడెల ఆత్మహత్యపై హైకోర్టులో పిటిషన్

కోడెల ఆత్మహత్యపై హైకోర్టులో పిటిషన్

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య ఘటనపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. కోడెల ఆత్మహత్య ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అనిల్ బూరగడ్డ అనే వ్యక్తి. కోడెల శివప్రసాద్‌ది ఆత్మహత్య కాదని.. ఆయన కుమారుడు శివరామ్ హత్య చేశాడనే అనుమానాలు కల్గుతున్నాయని ఫిటిషన్‌లో పేర్కొన్నారు. కేసుల నుంచి తప్పించుకోవడానికే శివరామ కృష్ణ.. శివప్రసాద్‌ను హత్య చేశాడని ఆరోపిస్తూ సీబీఐతో విచారణ జరిపించాలని పిటిషన్‌లో కోరారు. సీబీఐ, తెలంగాణ ప్రభుత్వం, బంజారాహిల్స్ సీఐని ప్రతివాదులుగా చేర్చాడు అనిల్ బూరగడ్డ. కోడెల శివప్రసాదరావు మంచి డాక్టర్, గ్రేటర్ లీడర్... ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడని కాదని చెప్పుకొచ్చారు. కోడెల హత్య వెనుక చంద్రబాబుకు రాజకీయ కుట్ర ఉంది.. కోడెల కుమారుడి పాత్ర కూడా ఉందని ఆరోపించారు.