మళ్లీ పెరిగిన పెట్రో ధరలు...

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు...

ఆల్ టై హైకి చేరిన పెట్రో ధరలపై ప్రజల నుంచి ఆందోళన వ్యక్తం కావడం... ప్రభుత్వంపై విమర్శలు పెరగడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంది. దీంతో వరుసగా నెల రోజులకు పైగా తగ్గుతూ వచ్చిన పెట్రో ధరలు... 36 రోజుల తర్వాత ఈ రోజు మళ్లీ పెరిగాయి. లీటరు పెట్రోల్ పై రూ. 17 పైసలు పెరగగా, లీటర్ డీజిల్ పై 12 పైసలు పెంచాయి ఆయిల్ కంపెనీలు. కాగా, ఈ మధ్య కాలంలోనే పెట్రోల్‌ ధర 22 సార్లు, డీజిల్‌ ధర 18 సార్లు తగ్గింది. ఇవాళ పెరిగిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.75.71కి చేరగా... లీటర్ డీజిల్‌ ధర రూ.67.50కి పెరిగింది. ఇక ఆయా రాష్ట్రాల్లో స్థానిక పన్నులను బట్టి వాటి ధరలు పెరిగాయి.