పెట్రోల్, డీజిల్ మళ్లీ తగ్గాయి..

పెట్రోల్, డీజిల్ మళ్లీ తగ్గాయి..

ఆకాశాన్నంటిన పెట్రోల్, డీజిల్ ధరలు గత కొద్దిరోజుల నుంచి స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్‌పై 15 పైసలు, డీజిల్‌పై 14 పైసలను తగ్గించినట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. మే 30 నుంచి నేటి వరకు తగ్గిన ధరలను బట్టి పెట్రోల్‌ 46పైసలు, డీజిల్ 33 పైసలు దిగొచ్చింది. గత మూడు రోజుల నుంచి ఇంధన ధరలు నిలకడగా ఉండటంతో పాటు.. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు కనిపిస్తోంది. తగ్గిన ధరల ప్రకారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.77.16, డీజిల్ రూ.68.97గా నమోదైంది.