పెట్రోల్ ధర కొత్త రికార్డు..!

 పెట్రోల్ ధర కొత్త రికార్డు..!

భారత్‌లో పెట్రో ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి... ఇవాళ కిలో పెట్రోల్ ధర ఏకంగా రూ.91 మార్క్‌ను కూడా క్రాస్ రూ.92కు చేరువ అయ్యింది. లీటర్ డీజిల్ ధర ఏకంగా రూ. 88 వైపు పరుగులు పెట్టింది. గత వారం రోజులుగా స్థిరంగా ఉన్నాయి పెట్రో ధరలు.. దేశీయ చమురు కంపెనీలు ఇవాళ పెట్రోల్‌, డీజిల్‌పై 25 పైసల వరకు పెంచేశాయి.. దీంతో.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర రూ.84.45కు చేరగా.. డీజిల్‌ ధర రూ.74.63కు పెరిగింది. ఈ పెంపుతో పెట్రో, డీజిల్‌ ధర కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.. జైపూర్‌లో ఏకంగా లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.91.85, డీజిల్‌ రూ.83.87గా చేరుకున్నాయి.. ఇక, ముంబైలో పెట్రోల్‌ ధర రూ.91.07కు చేరగా, డీజిల్‌ ధర రూ.81.34గా ఉంది. చెన్నైలో పెట్రోల్‌ రూ.87.18గా ఉంటే డీజిల్‌ రూ.79.95కు పెరిగింది.. కోల్‌కతాలో లీటర్‌ పెట్రోల్‌ రూ.85.92కు చేరగా.. డీజిల్‌ రూ.78.22గా పలుకుతోంది.. అదే హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ రూ.87.85గా ఉంటే.. డీజిల్‌ రూ.81.45కు పెరిగింది. ఇక, బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.87.30, డీజిల్‌ రూ.79.14గా ఉంది.. దేశంలో జైపూర్‌లో లీటర్ పెట్రోల్ అత్యధికంగా 91.85గా ఉండగా.. అత్యధికంగా హైదరాబాద్‌లో లీటర్ డీజిల్ 87.85కు పెరిగింది.