నాల్గో రోజూ తగ్గిన పెట్రో ధరలు...

నాల్గో రోజూ తగ్గిన పెట్రో ధరలు...

వరుసగా నాల్గో రోజూ కూడా పెట్రో ధరలను తగ్గించింది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్... తొలి రోజు 1 పైసా తగ్గించి విమర్శలపాలైన ఐవోసీ... ఆ తర్వాత వరుసగా లీటర్ పెట్రోల్ పై 7 పైసలు, 6 పైసలు... డీజిల్‌పై 5 పైసలు, 5 పైసలు తగ్గించి. అయితే ఈ రోజు పెట్రోలో, డీజిల్‌పై 9 పైసల మేర తగ్గించింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.78.20, డీజిల్ రూ.69.11కి చేరింది. కర్నాటక ఎన్నికల సమయంలో రోజు ధరల సమీక్షకు బ్రేక్ వేసిన కేంద్రం... ఆ తర్వాత వరుసగా 16 రోజులు పెట్రో ధరల పెంపుతో ప్రజల్లో ఆందోళన కలిగించింది. వరుసగా పెట్రో ధరలు పెరగడంతో మంగళవారం ఆల్ టై హైకి చేరాయి పెట్రో ధరలు... దీంతో ప్రభుత్వంపై విమర్శలు, ఒత్తిళ్లు పెరగడంతో దిద్దుబాటు చర్యలకు పూనుకున్న విషయం తెలిసిందే.