స్థిరంగానే పెట్రోలు, డీజిల్ ధరలు

స్థిరంగానే పెట్రోలు, డీజిల్ ధరలు

దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలో సోమవారం ఎలాంటి మార్పు లేదు. ఆదివారం నాటి ధరలే కొనసాగుతున్నాయి. దీంతో దేశీయంగా ఇంధన ధరలు వరుసగా ఆరో రోజు స్థిరంగానే ఉన్నాయి. నిన్నటితో పోల్చుకుంటే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు స్వల్పంగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 61.45 డాలర్ల వద్ద.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 53.43 డాలర్ల వద్ద ఉంది.

ఈ రోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.27లుగా.. డీజిల్ ధర రూ.66.00లుగా ఉంది. ముంబయిలో పెట్రోలు ధర రూ.76.90 వద్ద.. డీజిల్ ధర రూ.69.11 వద్ద కొనసాగుతోంది. హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ.75.61లుగా.. డీజిల్ ధర రూ.71.75లుగా ఉంది. అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.75.38 వద్ద, డీజిల్‌ ధర రూ.71.13 వద్ద కొనసాగుతోంది.