ఈ రోజు 6 పైసలు తగ్గింది...

ఈ రోజు 6 పైసలు తగ్గింది...

ఈ రోజు 6 పైసలు తగ్గిందంటే దేనిపైనా ఇప్పటికే అర్థమైఉంటుంది. మొన్న పెట్రోల్‌పై 1 పైస తగ్గించి విమర్శలపాలైన ప్రభుత్వం... నిన్న లీటర్ పెట్రోల్‌పై 7 పైసలు, లీటర్ డీజిల్‌పై 5 పైసలు తగ్గించింది. అయితే వరుసగా మూడో రోజు కూడా పెట్రో ఛార్జీలు తగ్గించారు. ఈ రోజు లీటర్ పెట్రోల్ పై 6 పైసలు, లీటర్ డీజిల్‌ పై 5 పైసలు తగ్గింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 78.29కు, డీజిల్ ధర రూ.69.20కు లభ్యమవుతోంది. కర్ణాటక ఎన్నికల సమయంలో కొంత కాలంగా రోజువారి చమురు ధరల పెంపునకు బ్రేక్ పడినా... ఆ తర్వాత వరుసగా 16 రోజులు పెరుగుతూ వచ్చాయి. దీంతో పెట్రో ధరలు ఆల్ టై హైకి చేరిపోయాయి. పెట్రో బాంబ్‌పై ప్రభుత్వంపై విమర్శలు తీవ్రతరం కావడంతో కేంద్రం దిద్దుబాటు చర్యలకు పునుకున్న సంగతి తెలిసిందే.