తగ్గిన పెట్రోల్ ధర...

తగ్గిన పెట్రోల్ ధర...

వరసగా నాలుగో రోజు దేశీయ ఇంధన ధరలు తగ్గాయి. దీంతో పెట్రోల్ ధర ఆదివారం10 నుండి11 పైసల వరకు తగ్గింది. మరోవైపు డీజిల్ ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 10 పైసలు తగ్గి రూ.70.74లుగా ఉంది. డీజిల్ ధర రూ.65.71లుగా ఉంది. ముంబయిలోనూ లీటర్ పెట్రోల్ 10 పైసలు తగ్గి రూ.76.37 వద్ద.. డీజిల్ ధర రూ.68.81 వద్ద కొనసాగుతున్నాయి. హైద‌రాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 11 పైసలు తగ్గి రూ.75.05 వద్ద.. డీజిల్ ధర రూ.71.44 వద్ద  ఉన్నాయి. అమరావతిలో పెట్రోల్‌ ధర రూ.74.84 లుగా.. డీజిల్‌ ధర రూ.70.84 లుగా కొనసాగుతున్నాయి.