హమ్మయ్య.. పెట్రోల్‌ లీటర్ రూ.100 అసాధ్యం...ఎందుకో తెలుసా?

హమ్మయ్య.. పెట్రోల్‌ లీటర్ రూ.100 అసాధ్యం...ఎందుకో తెలుసా?

పెట్రో ధరలు శరవేగంగా పరుగులు పెడుతున్నాయి. సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాయి. రోజురోజుకీ ధరలు పెరుగుతుండడంతో సెంచరీ ఖాయమని పలువురు సెటైర్లు వేస్తున్నా.. అది మాత్రం ఆచరణ సాధ్యం కాదని పెట్రోల్‌ బంకుల యజమానులు చెబుతున్నారు. పెట్రోల్‌ రేట్ల డిస్‌ప్లే మేషీన్లు 99.99 కంటే అధిక సంఖ్యను చూపించలేదని తేల్చేశారు. మూడు రోజుల క్రితం 'పవర్ 99' ఆక్టేన్‌ పెట్రోల్‌ ధర్‌ 100.33 కి చేరగా.. డిస్‌ప్లే మెషీన్‌లో రూ.33గా చూపించిందని చెప్పారు. 
గత ఏడాది నుంచి పవర్‌ 99 పేరుతో హెచ్‌పీసీఎల్‌ ఆక్టేన్‌ పెట్రోల్‌ను విక్రయిస్తోంది. సాధారణ పెట్రోల్‌ కంటే ఈ పవర్‌ 99 పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.20 అధికం. మూడు రోజుల క్రితం ఈ పవర్‌ 99 రకం పెట్రోల్‌ ధర రూ.100.33కి చేరినప్పుడు పెట్రోల్‌ బంకుల యజమానులు అమ్మకాలు నిలిపివేశారు. పెట్రోల్‌ బంకుల్లోని డిస్‌ప్లే మెషీన్లన్నీ సెంట్రల్‌ సర్వర్‌కు అనుసంధానం చేసి ఉంటాయి. అక్కడి నుంచి తప్ప ఈ మెషీన్లలోని అంకెలను మర్చలేం.