ఎన్నికలు ముగిశాయి: పెట్రో ధరలు మళ్లీ పైకి

ఎన్నికలు ముగిశాయి: పెట్రో ధరలు మళ్లీ పైకి

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి... ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ప్రచారానికి బలం చేకూర్చేవిధంగా... ఇవాళ దేశవ్యాప్తంగా పెట్రో ధరలు పెరిగాయి. ఇవాళ లీటర్ పెట్రోల్ పై 8 పైసలు నుంచి 10 పైసల వరకు వడ్డించిన చమురు సంస్థలు... లీడర్ డీజిల్‌పై 15 నుంచి 16 పైసలు చొప్పున పెంచాయి. దీంతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోలు ధర రూ. 75.43కు చేరుకోగా.. డీజిల్ ధర రూ. 71.90కు పెరిగింది. విజయడాలో లీటర్ పెట్రోల్ ధర రూ. రూ.74.84 పలుకుతుండగా.. డీజిల్ ధర రూ.70.94 చేరింది. ఇక ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 71.12కు పెరగగా.. డీజిల్‌ ధర రూ. 60.11కు చేరుకుంది. చెన్నైలో లీటర్ పెట్రోలు ధర రూ. 73.82గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 69.88గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 73.19కు చేరగా.. డీజిల్‌  ధర రూ. 67.86కు పెరిగింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 76.73గా పలుకుతుండగా.. డీజిల్‌ ధర రూ. 69.27కు చేరింది.