పెట్రో ధరలు కొత్త రికార్డు.. లీటర్ పెట్రోల్ రూ.92.54..
భారత్‌లో పెట్రో ధరలు రోజుకో కొత్త రికార్డు తరహాలో పెరిగిపోతున్నాయి.. మధ్యలో 5 రోజుల పాటు చమురు ధరలకు బ్రేక్ పడగా... బుధవారం నుంచి మళ్లీ వడ్డింపు మొదలుపెట్టాయి చమురు సంస్థలు.. ఇక, ఇవాళ కూడా వరుసగా రెండో రోజు ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు.. గురువారం రోజు ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 25 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.84.70కి చేరింది. డీజిల్‌పై కూడా 25 పైసలు వడ్డించడంతో.. లీటర్ డీజిల్ ధర రూ.74.88కు పెరిందిగి.. ఇక, తాజా పెంపుతో జైపూర్‌లో కొత్త రికార్డు సృష్టించాయి పెట్రోల్ ధరలు.. ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.92.54కి, డీజిల్ రూ.84.53కి పెరిగింది.. పెట్రోల్ ధర భారత దేశంలోనే అత్యధిక ధర పలికింది జైపూర్‌లోనే.. మరోవైపు.. డీజిల్ ధరలు రూ.81 మార్క్‌ను కూడా దాటేశాయి.. దేశంలోనే అత్యధికంగా డీజిల్ ధర హైదరాబాద్‌లో రూ. 81.72కు చేరింది. మొత్తంగా పెట్రోల్ ధరలు.. హైదరాబాద్‌లో రూ.88.11, కోల్‌కతాలో రూ.86.15, ముంబైలో 91.32, చెన్నైలో రూ.87.40, బెంగళూరులో రూ.87.56, భువనేశ్వర్ రూ.85.36, పాట్నాలో రూ.86.73గా ఉండగా.. లీటర్ డీజిల్ ధర కోల్‌కతాలో రూ.78.47, ముంబైలో రూ.81.60, చెన్నైలో రూ.80.19, బెంగళూరు రూ.79.70, హైదరాబాద్‌లో రూ.81.72, పాట్నాలో రూ.80.46కు పరుగులు పెట్టాయి. రోజురోజుకూ పైపైకి ఎగబాకుతోన్న పెట్రో ధరలు సామాన్యుడికి భారంగా మారుతుండగా.. మరోవైపు నిత్యావసర వస్తువలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందనే ఆందోళన నెలకొంది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)