మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. కొత్త రికార్డు..

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. కొత్త రికార్డు..

పెట్రో ధరలు భారత్‌లో రోజుకో కొత్త రికార్డు తరహాలో దూసుకెళ్తున్నాయి.. కొంత కాలం గ్యాప్‌ తర్వాత గత వారం నుంచి పెట్రోల్, డీజిల్‌పై వడ్డింపు మొదలైంది.. ఇక, ఇవాళ కూడా పెట్రో ధరలను పెంచేశాయి ఆయిన్ సంస్థలు.. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌పై 25 పైసల చొప్పున పెంచుతూ దేశీయ చమురు సంస్థలు నిర్ణయం తీసుకోగా.. వారం రోజుల వ్యవధిలోనే పెట్రో ధరలు 75 పైసలు పెరిగిపోయాయి.. తాజా వడ్డింపుతో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.84.95కు చేరగా.. లీటర్‌ డీజిల్‌ ధర రూ.75.13కు చేరాయి. ఇక, ఈ పెంపుతో దేశంలో గరిష్టస్థాయిని తాకాయి పెట్రో ధరలు.. దేశంలోనే అత్యధికంగా జైపూర్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.92.43కి చేరింది.. డీజిల్‌ ధర అత్యధికంగా భువనేశ్వర్‌లో రూ.81.90కు పెరిగింది.

ఇవాళ చమురు ధరలను ఓసారి పరిశీలిస్తే.. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ రూ.84.95, లీటర్‌ డీజిల్‌ రూ.75.13 కాగా.. జైపూర్‌లో పెట్రోల్‌ రూ.92.43, డీజిల్‌ రూ.84.46, హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.88.37, డీజిల్‌ రూ.81.99, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.86.39, డీజిల్‌ రూ.78.72, ముంబైలో పెట్రోల్‌ రూ.91.56, డీజిల్‌ రూ.81.87, చెన్నైలో పెట్రోల్‌ రూ.87.64, డీజిల్‌ రూ.80.44, బెంగళూరులో పెట్రోల్‌ రూ.87.82, డీజిల్‌ రూ.79.67, భువనేశ్వర్‌లో పెట్రోల్‌ రూ.85.66, డీజిల్‌ రూ.81.90గా ఉన్నాయి. అయితే, పెట్రో మంట.. నిత్యావసరాలపై కూడా క్రమంగా పడుతోందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.