నిలకడగా పెట్రోలు, డీజిల్ ధరలు

నిలకడగా పెట్రోలు, డీజిల్ ధరలు

గత నాలుగు రోజుల నుంచి నిలకడగా ఉన్న ఇంధన ధరలు ఆదివారం కూడా నిలకడగానే ఉన్నాయి. ఈ రోజు శనివారం నాటి ధరలే కొనసాగనున్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.27లుగా.. డీజిల్ ధర రూ.66.00లుగా ఉంది. ముంబయిలో పెట్రోలు ధర రూ.76.90 వద్ద.. డీజిల్ ధర రూ.69.11 వద్ద కొనసాగుతోంది. హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధర రూ.75.61లుగా.. డీజిల్ ధర రూ.71.75లుగా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ రూ.75.02 వద్ద, డీజిల్‌ రూ.70.80 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 61.64 డాలర్లుగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 53.69 డాలర్లుగా ఉంది.